MDK: ఉమ్మడి తూప్రాన్ మండలంలో ఊర కుక్కలు దాడి చేయగా పలువురు గాయపడ్డారు. ఆదివారం ఒక్కరోజే 15 మంది గాయపడ్డట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తూప్రాన్‌కు చెందిన అనిరుద్ (3) పై ఊర కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మరో ముగ్గురు చిన్నారులతో పాటు పలువురు ఊర కుక్కల దాడిలో గాయపడ్డారు.