VZM: వేపాడ మండలం ఆర్అండ్బి రహదారి కృష్ణరాయుడుపేట రైవాడ కాలువ వంతెన శిథిలావస్థకు చేరడంతో ఆదివారం అధికారులు మూసివేశారు. దేవరపల్లి కొత్తవలస విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికుల కష్టాలు మొదలయ్యాయి. నిత్యం వందలాది మంది ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.