NDL: జిల్లాలో సోమవారం నంద్యాల కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఇవాళ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సోమవారం ఉదయం 9,30 గంటల నుండి కొనసాగుతుందన్నారు.