KRNL: అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. సీపీఐ కార్యాలయం నందు మండల కార్యదర్శి భార్గవ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.