NLR: బుచ్చి మండలం జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాడ మాసం సారెను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలు అందజేశారు.