సత్యసాయి: మంత్రి కొల్లు రవీంద్ర నేడు కనగానపల్లికి రానున్నారు. ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి ఆయన పట్టణంలో పర్యటించనున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, పథకాలను వివరిస్తారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.