AP: వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు చికిత్స కొనసాగుతోంది. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో ముద్రగడకు డయాలసిస్ చేస్తున్నారు. కాగా, ఆయన ఆక్సిజన్ సహాయంతో ఊపిరి తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ముద్రగడ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.