VSP: ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఎవరూ అప్పు ఇవ్వడంలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ప్రజలను సంక్షేమ పథకాల నుంచి తప్పుదోవ పట్టిస్తుందని కేకే రాజు ప్రభుత్వంపై మండిపడ్డారు.