JGL: ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి, పోతరాజు, బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.