GNTR: జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వైసీపీపై నిప్పులు చెరిగారు. మనుషులకు మంచి చేసి, ప్రాంతాలను అభివృద్ధి చేసి ఓట్లు అడిగే ఆలోచన వైసీపీకి లేదని, దోచుకున్న డబ్బుతోనే రాజకీయం చేయాలని చూస్తుందని విమర్శించారు. శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.