MBNR: జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి ఎంక్లేవ్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.