ADB: నేరడిగొండ మండలం బుగ్గరాం(బి) MPUPS ఉపాధ్యాయ సిబ్బంది ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాలలో స్టేజి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే స్టేజి నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ జహీర్ తదితరులున్నారు.