WNP: అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై జరిగిన అవకతవకలపై తమ ఎదుట హాజరుకావాలని అమరచింత మున్సిపల్ కమిషనర్‌కు ఆర్టీఐ నోటీసులు జారీ చేసింది. పట్టణానికి చెందిన నిరుద్యోగి కొంగరి కృష్ణమూర్తి చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం రాకపోవడంతో ఆయన ఆర్టీఐ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 22న ఆర్టీఐ కమిషనర్ ఎదుట హాజరుకావాలని కమిషనర్‌కు నోటీసులు ఇచ్చింది.