ADB: ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడలో ఆదివారం జరిగే ఆదివాసీ తుడుందెబ్బ వ్యవస్థాపకుడు సిడాం శంబు పటేల్ 7వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు పేర్కొన్నారు. ఆయన శనివారం గాదిగూడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సభను ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు.