NDL: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.