RR: చేవెళ్ల పరిధిలోని ధర్మసాగర్ ప్రాంతంలో కురిసిన వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. నేడు ఉదయం 6 గంటల వరకు గత 24 గంటల్లో 123.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. అనేక చోట్ల 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పేర్కొంది.