కోనసీమ: ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని YCP రీజనల్ కో-ఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండపేటలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.