కృష్ణా: ప్రగతి పథంలో పామర్రు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామాన్ని సందర్శించారు. స్థానిక కార్యకర్త ఇంట్లోనే రాత్రి నిద్రించి గ్రామస్థులతో ముఖాముఖి చర్చలు నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.