HYD: హైదరాబాద్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున అదుపు తప్పి లారీ బోల్తా పడింది. దీంతో మైత్రీవనం, బంజారాహిల్స్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి వాహనం తొలగించే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.