MDK: తమ కార్యకర్తలకు కష్టం వస్తే ఏ హోదాలో ఉన్నా ఖచ్చితంగా వస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రి గం.9 అయితే ఫోన్లు ఆఫ్ చేసుకుని, ఉదయం 10 అయితే గానీ ఫోన్లు ఆన్ చేసే నాయకులం కాదన్నారు. ఏ సమయంలో ఐనా సరే కార్యకర్తల కోసం వస్తామన్నారు.