SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల పాలిట కల్పవల్లి, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి వార్షిక ఉత్సవ జాతర ప్రభుత్వ పరంగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఉత్సవాల నిర్వహించుకున్నట్లు ఎండోమెంట్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజులు పాటు జరిగే జాతరకు శాఖా పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.