కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన యువకుడు నదిలో స్నానానికి దిగి శనివారం గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పామర్తి దినేశ్ (22) స్నేహితులతో కలిసి స్వామి దర్శనానికి వచ్చాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి బంధువులు చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.