MNCL: కాసిపేట మండలం దేవాపూర్ ఎస్సైగా గంగారాం నియమితులు కాగా, దేవాపూర్‌లో ఎస్సైగా విధులు నిర్వహస్తున్న ఆంజనేయులును కాసిపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాసిపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను భూపాలపల్లికి బదిలీ చేశారు. కాసిపేట, దేవాపూర్ ఎస్సైలుగా ఆంజనేయులు, గంగారాంలు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.