NLR: జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరకు రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.