ATP: గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో భూముల రీ సర్వేను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పరిశీలించారు. భూముల రీ సర్వేకు వెళ్లే ముందు రోజే సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ రైతులు రీ సర్వేకు హాజరు కాలేకపోతే వారికి కనీసం మూడుసార్లు అవకాశం ఇవ్వాలన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రీ సర్వేను గడువులోపు పగడ్బందీగా పూర్తి చేయాలన్నారు.