TPT: మార్చి 9 నుండి 13వ తేది వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.