W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. పసర్లబారిన నీరే సరఫరా చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నగర పంచాయతీ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని కౌన్సిలర్లు ప్రస్తావించారు. మామూలు రోజుల్లోనే ఈ తరహా నీరు సరఫరా చేస్తుంటే, వేసవికి మంచినీటి ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.