ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఓటు వేశారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి లోకేష్.. కృష్ణ-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఓటు వేశారు. కాగా, ఇక్కడ ఆలపాటి రాజేంద్రప్రసాద్(కూటమి), కేఎస్ లక్ష్మణరావు(పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.