KMM: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని మండల ఎస్సై రవి అన్నారు. సోమవారం జూలూరుపాడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.