TG: పెద్దపల్లి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.16,500 లంచం తీసుకుంటూ డాక్యుమెంట్ రైటర్ రషీద్ పట్టుబడ్డారు. రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ.35వేలు డిమాండ్ చేశారు. వీరిని రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు.