టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. భువీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో UPకి సారథ్యం వహిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ యష్ ధుల్‌ను ఔట్ చేసి ఈ అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 287 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువి మొత్తం 300 వికెట్లు పడగొట్టాడు.