మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాలు సునామీ లాంటివని, దీనిని ఎవరూ ఊహించలేదని తెలిపారు. ఫలితాలను నమ్మలేకపోతున్నానని చెప్పారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఓట్ల సునామీకి అర్హులైనంతగా మహాయుతి కూటమి ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వారు ఏం చేశారో అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు, నిరుద్యోగం వంటి సమస్యలను ఎన్డీఏ పరిష్కరించలేదన్నారు.