TG: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు సీఎం కుంటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మల్లు రవి వెల్లడించారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణం తన ఇంటికి రోడ్డు లేకుండా చేయడమే అన్న ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. మాజీ సర్పంచ్ ఇంటికి దారి లేనట్టు కేటీఆర్ నిరూపిస్తే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. రాజీకీయ లబ్ధికోసమే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.