VZM: కూటమి ప్రభుత్వం ఉద్యోగంలో కొనసాగిస్తుందో లేదో.. అని ఆందోళనతో మరణించిన వాలంటీర్‌కి ఏఐటీయూసీ శనివారం నివాళులు అర్పించారు. ఈ మేరకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ హత్యే అని అన్నారు. ఈ సందర్బంగా వాలంటీర్లు అందరూ కలిసి గంట స్థంభం నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.