జార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ నేత చంపై సోరెన్ విజయం సాధించారు. సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి గణేష్ మహాలీపై చంపై 20,447 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనవరిలో మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం JMM పార్టీలో సీనియర్ నేతగా ఉన్న చంపై సోరెన్‌ను సీఎం స్థానంలో కూర్చోబెట్టారు. కాగా, సీఎం అయిన కొన్ని రోజులకే చంపై బీజేపీలో చేరారు.