మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయమైన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఫలితాలు అనూహ్యమని, సమగ్రంగా విశ్లేషిస్తామన్నారు. జార్ఖండ్ ఫలితాలపై మాట్లాడుతూ రాజ్యాంగంతోపాటు నీరు, అడవులు, భూమిపై విపక్ష కూటమి సాధించిన విజయమన్నారు. వయనాడ్లో ప్రియాంకా గాంధీని భారీ మెజార్టీతో గెలిపించినందుకు గర్విస్తున్నానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.