AP: ప్రజాస్వామ్యం గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. నిబంధనల మేరకే పీఏసీ ఛైర్మన్, ఇతర పదవులకు ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఈ పదవులన్నీ పూర్తిగా స్వీకర్ పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. జగన్ అమెరికాలో కూడా ఏపీ పరువు తీశాడని మండిపడ్డారు. నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి కనీసం ఓటు కూడా వేయలేదని చెప్పారు. తనకు జగన్ కూడా ఓటు వేయరని పెద్దిరెడ్డికి తెలుసని ఎద్దేవా చేశారు.