TG: CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ చేపట్టింది. NHRCకి అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.