ప్రకాశం: వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న జిల్లా కలెక్టరేట్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని అఖిలపక్ష కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుందని ఆ సంఘ జిల్లా నాయకులు చుండూరి రంగారావు తెలిపారు. కనిగిరిలో ధర్నాకు సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు.