TG: న్యాయమూర్తుల నియామకంలో కుల వివక్ష మిగతా అన్ని రంగాల్లో కంటే ఎక్కువగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అన్ని విధాలుగా అర్హతలు ఉన్నా బీసీలు హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జీలుగా ఎందుకు లేరని ఇదేం దుర్మార్గమన్నారు. బీసీలకు శాసన సభ, శాసన మండలి, పార్లమెంటులో రిజర్వేషన్లు లేవని.. న్యాయవ్యవస్థలో కూడా వివక్ష కొనసాగుతుందన్నారు. ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఉందని కులాల మీద లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.