బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సత్తా చాటింది. ఆర్జేడీ, వామపక్షాలను మహా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ఇండియా కూటమి ఏ మాత్రం ప్రభావం కనబర్చలేదు. బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీలో ఏన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. తరారీలో బీజేపీ తొలిసారి విజయం సాధించింది. సునీల్ పాండే తనయుడు విశాల్ ప్రశాంత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ మాలె రాజు యాదవ్‌పై 10612 ఓట్లతో విజయం సాధించారు.