కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం కోసం అంతర్రాష్ట్ర మండలిని ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్రం పునరుద్ధరించింది. అంతరాష్ట్ర మండలి శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. శాశ్వత ఆహ్వానితుడిగా తనను నియమించినందుకు కిషన్ రెడ్డి ప్రధానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ మండలిలో మొత్తం తొమ్మిది మంది కేంద్రమంత్రులు సభ్యులుగా ఉంటారు. కాగా.. మండలి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపికయ్యారు.