తన కుటుంబంపై గత కొంతకాలంగా వస్తోన్న వార్తలపై బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. ‘నా కుటుంబ వ్యక్తిగత గోప్యతకు నేను భంగం కలిగించకూడదు. అందుకే నేను ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడను. అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది నిజమైన వృత్తి ధర్మం’ అని బ్లాగ్లో పోస్ట్ పెట్టారు.