KRNL: ఆదోని బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం ఆదోని పట్టణ శివారులో ఉన్న ఆలూరు రోడ్డు ఉన్న చెక్ పోస్టును, శిరుగుప్ప జంక్షన్ ప్రధాన చెక్ పోస్టులను ఎస్పీ పరిశీలించారు. ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.