MDCL: అల్వాల్ సర్కిల్ వెంకటాపురం 193 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ కమిటీ అధ్యక్షురాలిగా ముగ్యారి లలితా దేవేందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం లలితా దేవేందర్ దంపతులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన మైనంపల్లి ఘనంగా సత్కరించారు. తమకు అవకాశం కల్పించినందుకు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.