MLG: జంగాలపల్లికి చెందిన అంగన్వాడి టీచర్ శ్రీపాదసుశీల విధినిర్వహణలో వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ములుగు ఆస్పత్రిలో, హనుమకొండ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయిందన్నారు. సుశీల మృతితో కుటుంబం ఆధారాన్ని కోల్పోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.