వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సల్కాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలను కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి నీటి సంపులో ముంచి చంపేశాడు. అనంతరం అతడు కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు దేవరకద్ర మండలం డోకురు గ్రామానికి చెందినవారుగా స్థానికులు తెలిపారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.