NTR: కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడలోని ఫైర్ స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించాలని కోరారు.