అన్నమయ్య: చౌడేపల్లె మండలానికి 75 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులు వచ్చినట్లు ఏవో మోహన్ తెలిపారు. బుధవారం నుంచి రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 10 కిలోల బస్తా అసలు ధర రూ.1540 కాగా, రాయితీతో రూ.770కే అందజేస్తారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్, ఫోన్ నంబరుతో ఆర్ఎస్కే కేంద్రంలో ఎరువులు పొందాలని సూచించారు.