ATP: గుంతకల్లు భాగ్యనగర్‌లో నివాసముంటున్న జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు ఖాదర్ బాషా ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. బీరువాలో దాచిన 7.5 తులాల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.